Wednesday, April 21, 2010

మాయన్నీ తీస్క పోతారు... !

మాయన్నీ తీస్క పోతారు... !

ఇదీ శ్రీకృష్ణ కమిటీ ముందు మొన్నటికి మొన్న ఒక తెలంగాణా ఆడబిడ్డ సెప్పినట్టుగా ఒక ఇంగిలీసు పేపర్లో పేద్ద అక్షరాలతో వచ్చిన వార్త. ఇది ఎవరిని ఉద్దేశించి అంటారా? అదేమి పెత్యేకించి చెప్పబళ్లా. ఆంధ్ర రాయల సీమోళ్ళనేగా వాళ్ళు ఎప్పుడూ దెప్పి పొడిచేది?


ఏమి ఎత్తుకొని పోయినాము తల్లీ? నీ భూమి నీ దగ్గెడే గదా ఉంది. నీ చెట్లు మేమేమి నరుక్కొని పోలా కదా? నీ పైర్లు బాగా చూసుకో, మీ మడికాడే ఉంది. మేమేమి కోసుకొని పాయినామా?

మేమేమన్న నీకన్నా బావుండామని అనుకోన్నావేమో? ఈపక్క ఓసారి వచ్చి చూస్తే తెలుస్తాది. మీయి మాయి ఒకటే రకం బతుకులు తల్లీ! మీ ఎండే మాకు, మీ ఎండిన బాయినీళ్ళ గొడవలే మావీ.
ఎవరో మీ ఊరి సర్పంచి కాని వేరే నాయకులు కాని చెప్పినారని మమ్మల్ని శత్రువులు మాదిరి చూడబాక. అవన్నీ కడుపులో చల్లగా పడ్డాక మాట్లాడేవోళ్ళు చేసే పని. మనం ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నా, లేక రేపు నువ్వు తెలంగాణాలో నేను రాయలసీమలో ఉన్నా, మన సేద్ద్యెం మనదే, మన కయ్యిలకాడ పనులు మనవే. మన పిల్లలు, ఇంట్లో ముసలోళ్ళ సంగతులు చూసుకోవడం ఎలాగో తప్పదు. ఇంకెందుకు ఈ దెబ్బలాటలు? తెలంగాణా వెనక బడలేదని నేను చెప్పలా, కానీ మా సీమ కూడా మీయంతే, ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎనకబడి ఉంది. చెప్తే నమ్మవేమో. ఏంజేసేది? నువ్వు మా నేల పగుళ్ళు చూళ్ళేదు కదా? ఇంకా మా పగిలిన గుండెల సంగతులేం తెలుసుకుంటావు? వెనకబాటుతనానికి ముందు వెనుకలు ఉండవు. కాకపోతే ఓ ప్రాంతం ఎక్కువ ఎనకబడి ఇంకో ప్రాంతం తక్కువ ఎనకబడి ఉండొచ్చు.


వాస్తవాలు తెలుసుకో వేరుపడడం వాళ్ళ ఏమీ రాదని అర్థం చేసుకో చెల్లెమ్మా!

4 comments:

  1. వర్షపు చుక్క లేక తడారిపోయిన నేలను చూస్తే
    అన్నం మెతుకు లేక రేపటితరం మరింత ఏమవబోతుందో అని భయమేస్తుంది.
    పెరిగే ధరల్ని చూస్తూ రోజు రోజుకీ కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు.
    ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం మీద ఉన్న ఆసక్తి
    ఉన్న నీళ్ళతో తిండిగింజలు, కూరగాయలు పండించుకోవడం మీద చూపించడం లేదు మనం.

    ReplyDelete
  2. తెలంగాణా ఇవ్వడానికి మామూలూ జనానికి ఎటువంటి ఇబ్బంది కానీ అభ్యంతరం కానీ లేదు.హైదరాబాదులో ఎకరాలకెకరాలు పొగేసిన వాళ్ళకే అసలు బాధ.
    నేను అంధ్ర వాసిని.

    ReplyDelete
  3. @చెప్పు దెబ్బలు-పూలదండలు,
    ఎకరాలెకరాలు పోగేసిన వాళ్ళకే అసలు బాధంటున్నారు, కష్టపడి ఒక డీసెంట్ జాబ్ సంపాదించుకుని, బ్యాంక్ లోన్ తీసుకుని ఒక ఫ్లాట్ కొనుక్కున్నవారికి ఏ అభ్యంతరం లేదన్న మాట మీ లెక్క ప్రకారం. అసలు బాధ వాళ్ళదే. ఎకరాలెకరాలు పోగేసిన వారికి దానికి తగినట్టే బలం, బలగం ఉంటుంది. రాష్ట్రం విడిపోయినా వాళ్ళకేమీ కాదు. వాళ్ళ లాబీయింగ్ వాళ్ళకుంటుంది. వాళ్ళనేమి చేయలేక మీరు సెటిలర్స్ అంటూ రేపు తెలంగాణావాదులు పడేది వీళ్ళమీదే.

    ReplyDelete
  4. అబ్బా... అబ్బా.. ఏం చెప్పినావబ్బా...సరిగ్గా చెప్పినావ్
    కానీ ఇంకో మాట... మాయన్నీ లాక్కోంబోతావుండారని అనిందెవురు?
    ఏ ముక్కునా బట్ట మాటలు ఇనేసి అట్ట మాట్లాడేసి ఉంటార్లే పాపం.

    ReplyDelete