కేసిఆర్ యొక్క అవివేకం నానాటికి బయటపడుతూ ఉంది. తెలంగాణా ఉద్యమంలో ప్రజలచేత నానాటికి చీదరించుకో బడుతున్నాడు. సీమోళ్ళని ఆంధ్ర వాళ్ళని తిట్టి పోసాక, ఇప్పుడు తెలుగు తల్లినే తిట్టడం ప్రారంభించాడు. మాట్లాడేది తెలుగు, చదివేది తెలుగు, వ్రాసేది కూడా తెలుగే, కాని తెలుగు తల్లి మాత్రం సీమాంధ్ర వాళ్ళ కల్పన అట!
మన దేశంలో ప్రతి రాష్ట్రం ఒక విభిన్న భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి నిలయం. ప్రతి నాగరికతకు చిహ్నంగా ఆరాధ్య దైవంగా ఒక మాతృమూర్తిని ఎంచుకున్నారు. తమిళనాడుకు కాని, కర్నాటకకు కాని కేరళకు గాని తమ భాషకు ప్రతిరూపంగా కళలకు ప్రతీకగా ఒక తల్లి శిలావిగ్రహం ఉంటుంది. అలాగే మనకు కూడా. ఇది తెలంగాణా అయినా, రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా అందరికీ శతాబ్దాలుగా ఉండేదే! కెసిఆర్ చదువుకున్నపుడు కూడా 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ' పాట పాడే ఉంటాడు.
ఇప్పుడు హటాత్తుగా తన తల్లిని తల్లి కాదు అని, "మా తల్లి వేరే ఆవిడ" అని చెప్పే అంత నీచ సంస్కృతిని ఏమనాలి? ఇది తన సొంత ప్రాంతంవారు కూడా హర్షించారు. అన్నదేదో అన్నాడు కాని, రేపు, మా భాష తెలుగే కాదు, దీనికి వేరే పేరు ఉందని కూడా అంటాడు. ప్రజలను (తెలంగాణా ప్రజలను అని నొక్కి చెప్పాల్సిన పని లేదు) దాదాపు దశాబ్ద కాలంగా యేమార్చిన ఈ నేత ఎంతకైనా తెగిస్తాడు అనడంలో సందేహం లేదు. ఈ మాయల ఫకీరు మాయలో ఇంకా పడేవాళ్ళు ఉన్నారా?
నీ తల్లి!
తిట్టలేదు కెసిఆర్. 'తెలుగు తల్లి ఎవరు?' అని అడిగావు కదా. దానికి ఇదే నా సమాధానం!!!!!
seriously Telugu talli is Telangana talli only. For We andrites we have Andra Mata.
ReplyDeleteif state is divided official language of costal andhra will be Andhramu not telugu. Telugu is for telangana and rayalaseema.
dunnapotu meeda varsham kurisinatle kcr ni enta tittina
ReplyDelete